Tuesday, 16 October 2012

End to darkness

ప్రేమ రాసాంతరంగ, కరుణా తరంగ సహిత గంగా సమాన పవిత్ర ధామా.
ధూర్త శిక్షణా, ధర్మ రక్షణా విచక్షణా ధిక్సూచిత రామా.
వింధ్యాద్రిసమ ధృడ ప్రళయ రథాలంక్రిత, ధర్మ సారథ్య జగద్గురు సార్థక నామ.
ఘన సుగుణ గణ ఘనీభవ మంగళ సుగునాభి సోమ.
క్షీర సాగర నివాస, శ్రీ సహిత శ్రీనివాసా.
పన్నగశయన లోకనాథ, కరుణా నయన త్రిలోకనాథ.
మా నిశి సమాన తామస సహిత బ్రతుకులను,
నీ శశి సమాన తేజో సహిత వెన్నెలతో వెలిగించు

Monday, 13 February 2012

ITZ ME

పిల్లనగ్రోవే నువ్వైతే, చల్లని గాలే నిను చుడితే.
పున్నమి వెన్నెల నువ్వైతే, నల్లని నింగే నిను ముడితే.
ఆదమరిచి నువ్వు నిదురిస్తే, కమ్మని కల నిను కవ్విస్తే.
బాధకలిగి నువ్వు ఏడిస్తే, ఏడ్చినపుడు కన్నీరోస్తే. 
ఆ చల్లని గాలి, ఆ నల్లని నింగి,
ఆ కమ్మని కల, ఆ కన్నీటి చుక్క, అన్నీ నేనే.   

Monday, 21 February 2011

world's prettiest

చల్లని వన్నెల వెన్నెల కొలిమిని దాచిన కళ్ళు. 
మందారపు రేకుల ఆధారాపు సింధూరపు మిళిత అధరాలు.
మధువు చిలికి నవ్వులోలికి ఎరుపెక్కే చెక్కిళ్ళు.
ఆ చక్కర చెక్కిళ్ళు ఫక్కున నవ్వితే తళుక్కున మెరిసే నొక్కిళ్ళు.
అతిలోకపు ఇతిహాసము అసలెరుగని సుకుమారం.
స్వాతి ముత్యపు జల్లులాంటి అలుపెరుగని దరహాసం.
వర్ణనల వర్ణంలో మునిగింది.
పొగడ్తల పర్వంలో తడిసింది.
ఎవరిదంట ఆ అందం..?
దుఖ సంద్రాన్ని దాటించి, కరుణ సంద్రంలో ముంచేసే 'భధ్రాద్రి రామునిది' ఆ అందం.
$జై శ్రీరామ్$